: కోటీ 58 లక్షలు పలికిన టిప్పు సుల్తాను ఉంగరం
మైసూర్ మహారాజ్, టైగర్ ఆఫ్ మైసూర్... టిప్పు సుల్తానుకు చెందిన ఉంగరాన్ని బ్రిటన్ లో క్రిస్టీస్ సంస్థ వేలం వేసింది. ఈ వేలంలో టిప్పు సుల్తాన్ ఉంగరం 1,57,91,540.89 రూపాయల రికార్డు ధరకు అమ్ముడు పోయింది. తాము అంచనా వేసిన దానికంటే పది రెట్ల అధిక ధర లభించిందని క్రిస్టీస్ సంస్థ తెలిపింది. దేవనాగరి లిపిలో శ్రీరామనామం కలిగి ఉన్న ఆ ఉంగరాన్ని అజ్ఞాత వ్యక్తి వేలం పాడాడు.
1,45,000 యూరోలు వెచ్చించి ఈ ఉంగరాన్ని ఆయన కొనుగోలు చేసినట్టు క్రిస్టీస్ సంస్థ వెల్లడించింది. ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన సందర్భంగా ఈ ఉంగరాన్ని సేకరించినట్టు పేర్కొన్నారు. కాగా ఆ ఉంగరాన్ని సేకరించిన వ్యక్తి భారతీయ సామాజిక సేవకుడుగా క్రిస్టీస్ సంస్థ పేర్కొంది. ఈ ఉంగరాన్ని 2012లో ఒకసారి వేలానికి ఉంచినప్పటికీ వేలం జరగలేదు.