: రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చే బాధ్యత నాది: చంద్రబాబు


కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులపై దృష్టి పెట్టారు, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో తన నివాసంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చేందుకు అధ్యయనం చేయాలని వారికి చెప్పారు. నిధులు తెచ్చే అవకాశాలపై సమగ్ర నివేదిక ఇవ్వండని తెలిపారు. ఇప్పటికే ప్రజలకు చాలా హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చాల్సి ఉందని బాబు గుర్తు చేశారు. ఎన్నికల్లో హామీలను చిత్తశుద్ధితో అమలుపరిచేలా అధికారుల పనితీరుండాలని చెప్పారు. కాబట్టి, నిధుల కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియ చెప్పాలన్నారు. 'మీరు (ప్రభుత్వ అధికారులు) సక్రమమైన నివేదిక ఇస్తే నిధులు తెచ్చే బాధ్యత నాది' అని బాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News