: సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాదులోనే ఉంటారు: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు


రాజ్యాంగ బద్ధంగా హక్కులు కలిగిన సీమాంధ్ర ఉద్యోగులకు హైదరాబాదులో ఉండే హక్కు కూడా ఉందని ఏపీ కాంగ్రెస్ నేతలు చెప్పారు. డొక్కా మాణిక్యవరప్రసాద్, శైలజానాథ్ తదితరులు మాట్లాడుతూ, సీమాంద్ర ఉద్యోగులు ఎక్కడకూ వెళ్లరని... ఇక్కడే ఉంటారని తెలిపారు. ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విషయంలో కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు బెదిరించేలా ఉన్నాయన్నారు. కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నారని... ఆయన తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News