: తెల్లారితే పెళ్లి... ఇంతలోనే ఘోరం


తెల్లారితే పెళ్లి..ఎన్నో ఊహలు...ఇంకెన్నో ఆశలు...అన్నీ బుగ్గైపోయాయి. నవ వధువు సజీవదహనమైన ఘటన విశాఖ జిల్లా భీమిలి మండలం తాటితూరులో చోటుచేసుకుంది. చిల్ల ఎల్లయ్యమ్మకు వివాహం నిశ్చయమైంది. తెల్లవారితే పెళ్లి అనగా వంట చేసేందుకు పొయ్యి వెలిగిస్తుండగా నిప్పంటుకుంది. చూస్తుండగానే మంటలు శరీరమంతా వ్యాపించడంతో ఆమె కేకలు వేసింది. తక్షణం స్పందించిన ఆమె కుటుంబసభ్యులు మంటలను ఆర్పి కేజీహెచ్ కు తరలించారు. బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పెళ్లి వారింట విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News