: రాహుల్ ట్విట్టర్, ఫేస్ బుక్ ఉపయోగించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు: మొయిలీ


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక నెట్ వర్కులు ఉపయోగించి పార్టీ ప్రచారం చేపట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అర్బన్ ఓటర్లే తమను ముంచేశారని అన్నారు. ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఐటీ విప్లవానికే బలైందని మొయిలీ తెలిపారు. బీజేపీ గెలుపుకోసం ఆర్ఎస్ఎస్ కేడర్ దేశవ్యాప్తంగా 24 గంటలు పని చేసి మంచి ఫలితం సాధించిందని ఆయన తమ పనితీరుపై పరోక్షంగా పెదవి విరిచారు.

  • Loading...

More Telugu News