: జగ్గారెడ్డి పార్టీ మారతారనేది అవాస్తవం: పొన్నాల
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. ఆయన పార్టీ మారుతున్నారనేది అవాస్తవమని చెప్పారు. ఆయన నివాసంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. అనంతరం మీడియాతో పొన్నాల మాట్లాడుతూ, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, ఎక్కడి వారు అక్కడే పని చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. మున్సిపల్, జడ్పీ ఛైర్మన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలవగానే విప్ జారీ చేస్తామని తెలిపారు.