: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మోహన్ భగవత్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని ఇవాళ ఉదయం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఉన్నారు. మోహన్ భగవత్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా నూతంకిలో జరిగే ఆర్ఎస్ఎస్ క్యాంపుకు వెళుతూ భగవత్ ఇక్కడకు వచ్చారని ఎంపీ గంగరాజు చెప్పారు.