: తనను తాను ప్రధానిగా ప్రకటించుకున్న థాయ్ లాండ్ ఆర్మీ చీఫ్


థాయ్ లాండ్ ప్రధానిగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రయూత్ చాన్ ఓచా తనకు తాను ప్రకటించుకున్నారు. ప్రధాని పదవికి పూర్తి స్థాయి వ్యక్తి లభించేంత వరకు ఓచానే ప్రధానిగా కొనసాగనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. చట్ట ప్రకారం తగిన అధికారాలు ప్రధానికే ఉన్నందున ఓచా తనను ప్రధానిగా ప్రకటించుకున్నారు. దేశంలో రాజకీయ, పాలనా అనిశ్చితి నేపథ్యంలో ఓచా నిన్న తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. రేడియో, టీవీలపై ఆంక్షలు కూడా విధించారు. 1932 తర్వాత థాయ్ లాండ్ సైనిక పాలన కిందకు వెళ్లడం ఇది 12వ సారి. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కోర్టు ప్రకటించడంతో ఇంగ్లక్ షినవత్ర ఈ నెల 7న ప్రధాని పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News