: మోడీ తల్లి, భార్యకు ఎస్పీజీ భద్రత
నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తల్లి హీరాబెన్, భార్య జశోదాబెన్ కు ఎస్పీజీ భద్రత కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 26న మోడీ దేశ 14వ ప్రధానిగా పదవీ ప్రమాణం చేయనున్న విషయం తెలిసిందే. ఇక, మోడీ ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులకు గుజరాత్ సర్కారు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తుందని అధికారులు తెలిపారు. మోడీ తల్లి, భార్య భద్రత విషయమై ఎస్పీజీ కమాండోలను గుజరాత్ కు పంపినట్లు ఓ అధికారి తెలిపారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రధాని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక భద్రత కల్పించాల్సి ఉంటుంది.