: జైల్లో రెండు రాత్రులు పూర్తి చేసుకున్న కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో రెండు రాత్రులు పూర్తి చేసుకున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ ఈ రోజు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ముందుకు మరోసారి రానుంది. అవినీతిపరుల జాబితాలో తన పేరును చేర్చినందుకు బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కేజ్రీవాల్ పై పరువు నష్టం వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. పూచీకత్తుగా బాండ్ ను సమర్పించాలని కోర్టు ఆదేశించగా కేజ్రీవాల్ నిరాకరించి జైలుకు వెళ్లారు. అయితే, ఈ రోజు విచారణలోనూ బెయిల్ కోసం బాండ్ సమర్పించనవసరం లేదని ఆయన తరపు లాయర్లు వాదించనున్నారు. అయినా జడ్జి అంగీకరించకుంటే పై కోర్టుకు వెళ్లాలన్నది కేజ్రీవాల్ ఆలోచన అని చెబుతున్నారు.