: వైకాపా నేత వడ్డేపల్లి కన్నుమూత
కూకట్ పల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత వడ్డేపల్లి నర్సింగరావు (64) ఈ తెల్లవారుజామున మృతి చెందారు. గతకొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి వడ్డేపల్లి అత్యంత సన్నిహితులు. 2005లో ఆయన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా పనిచేశారు. వడ్డేపల్లి మృతితో ఆయన నివాసం వద్ద విషాదం నెలకొంది. ఆయన అభిమానులు దు:ఖసాగరంలో మునిగిపోయారు.