: తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: అజిత్ సింగ్


తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర  ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కేంద్ర మంత్రి అజిత్ సింగ్ డిమాండు చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యే విధంగా ఒత్తిడి తీసుకువస్తామని ఆయన అన్నారు. తెలంగాణపై మద్దతు కూడగట్టేందుకు ఎంపీ వివేక్, మాజీ రాజ్యసభ సభ్యుడు కేకే ఢిల్లీలో అజిత్ సింగ్ తో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేశవరావు...
రాజీనామాల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటుకోసం సమర్పించిన రాజీనామాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ వేచిచూసే ధోరణి అవలంభిస్తే కాంగ్రెస్ కే నష్టమని ఆయన హెచ్ఛరించారు.

  • Loading...

More Telugu News