: వేసవి రద్దీ దృష్ట్యా 16 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే


వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. వీటిలో సికింద్రాబాదు- విశాఖ మధ్య 8 ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాదు నుంచి విశాఖపట్నానికి జూన్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. అలాగే జూన్ 5, 12, 19, 26 తేదీల్లో విజయవాడ నుంచి సికింద్రాబాదుకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విజయవాడ నుంచి రాత్రి 11 గంటలకు ఈ రైళ్లు సికింద్రాబాదుకు బయల్దేరతాయని రైల్వే అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News