: ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్
ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు.. ఇంజినీరింగ్ లో 94.37 శాతం హాజరు, మెడికల్, అగ్రికల్చర్ లో 94.27 శాతం హాజరు నమోదైనట్టు ఆయన చెప్పారు. ఎల్లుండి ఎంసెట్ ప్రాధమిక కీ విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆన్ లైన్ లో అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ ఈ నెల 31 అని ఆయన తెలిపారు. వచ్చే నెల 9న ఎంసెట్ ఫలితాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు.