: తొలిరోజే హెచ్1బి వీసాలకు అధిక స్పందన
హెచ్1బి వీసాల కోసం ఈసారి స్పందన వెల్లువెత్తింది. 65 వేల వీసాల జారీ కోసం అప్లికేషన్లను ఆహ్వానిస్తే.. ఏప్రిల్ 1న తొలిరోజే 50వేల అప్లికేషన్లు వచ్చి పడ్డాయని సమాచారం. వచ్చే అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న 2014 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 65వేల హెచ్1బి వీసాలను జారీ చేయనున్నారు. వీటికి అదనంగా అమెరికాలోనే ఉన్నత విద్య అభ్యసించిన వారికి అక్కడే ఉద్యోగం చేసేందుకు వీలుగా మరో 20వేల వీసాల వరకూ జారీ చేయనున్నారు. అయితే, ఇప్పటి వరకూ దరఖాస్తులు ఎన్ని వచ్చాయనే విషయాన్ని అమెరికా పౌర, వలసదారుల సేవా విభాగం ఇంకా ప్రకటించలేదు.