: సీమాంధ్ర విషయంలో కేంద్ర హోం శాఖ అధికారులను నిలదీసిన మోడీ
రాష్ట్ర విభజన, సీమాంధ్ర ప్రయోజనాలపై కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీమాంధ్ర ప్రయోజనాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... సీమాంధ్రకు న్యాయం చేయాలంటే లక్ష కోట్లు కావాలని హోం శాఖ అధికారులు చెప్పారు. దీంతో, సీమాంధ్రకు న్యాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులను మోడీ ఆదేశించారు. గతంలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకోవాలని అధికారులకు సూచించారు.