: మూడోసారి ప్రధాని అవుతానన్నది ఊహాజనితం: మన్మోహన్


ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ ఉపాధ్యక్ష్యుడు రాహుల్ గాంధీని తాను ఎప్పుడైనా స్వాగతిస్తానని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా తాను బరిలో లేనని పరోక్షంగా చెప్పారు. దేశానికి మూడోసారి తాను ప్రధాని అవుతానన్నది ఊహాజనితమైన ప్రశ్న అని మన్మోహన్ సింగ్ అన్నారు.

ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమం అనంతరం మీడియాతో ప్రధాని మాట్లాడారు. కేంద్రంలో రెండు అధికార కేంద్రాలు ఉన్నాయన్న చర్చ అనవసరమని చెప్పారు. ఈ సందర్భంగా మన్మోహన్ పారిశ్రామిక వేత్తల సదస్సులో గురువారం రాహుల్ చేసిన ప్రసంగాన్ని మెచ్చుకున్నారు

  • Loading...

More Telugu News