: ఇక్కడ పనిచేయాలని ఎవరూ అనుకోవట్లేదు: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం


సీమాంధ్ర ఉద్యోగులను మెడబెట్టి గెంటేస్తామని అనడం విడ్డూరంగా ఉందని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులు అలా మాట్లాడరాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఏ ఉద్యోగి అయినా నడుచుకోవాలని చెప్పారు. తెలంగాణ నేతలు, ఉద్యోగ సంఘ నేతల మాటలను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకుపోతామని హెచ్చరించారు. ఉద్యోగులకు ఆప్షన్లు కచ్చితంగా ఉండాల్సిందేనని మురళీకృష్ణ తెలిపారు. ఆప్షన్లు ఇస్తే సీమాంధ్ర ఉద్యోగులందరూ సీమాంధ్రకు వెళ్లిపోతామని చెప్పారు. ఆప్షన్లు ఉద్యోగుల హక్కు అని... వాటికోసం పోరాటం చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News