: రోడ్డుప్రమాదంలో ప్రముఖ నటుడు నాజర్ కుమారుడికి తీవ్ర గాయాలు


చెన్నైలో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రముఖ సినీ నటుడు నాజర్ కుమారుడు అబ్దుల్ హసన్ ఫైజల్ తీవ్రంగా గాయపడ్డారు. ఫైజల్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫైజల్ స్నేహితులు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. అయితే, అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఫైజల్ ను చికిత్స నిమిత్తం చెన్నైలోని చెట్టినాడు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతడికి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నాజర్ కుటుంబ సభ్యులు చెట్టినాడు ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News