: విభజనలో ఏపీకి అన్యాయం చేయొద్దు: చంద్రబాబు
లోటు బడ్జెట్టు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు విభజనలో అన్యాయం చేయొద్దని కాబోయే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. నిబంధనల మేరకు విభజన ప్రక్రియ కొనసాగించాలని అధికారులకు చెప్పారు. ఈ మేరకు తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ మహంతి, పీవీ రమేష్, ముఖ్య కార్యదర్శులతో బాబు విభజనపై చర్చించారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాలని కూడా తెలిపారు.