: ఎన్డీఏ కేబినెట్ రేసులో తాను లేనన్న యడ్యూరప్ప


కేంద్రంలో ఎన్డీఏ కేబినెట్ లో పదవికోసం ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలను బీజేపీ ఎంపీ యడ్యూరప్ప ఖండించారు. ఈ మేరకు నరేంద్రమోడీకి ఓ లేఖ రాసిన ఆయన, తాను పదవికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదని చెప్పారు. ఇకనుంచి కర్ణాటకలో బీజేపీని బలపర్చే విషయంపై దృష్టి పెడతానని తెలిపారు. 'దేశ వ్యాప్తంగా మనపై అంచనాలు, ఆకాంక్షలు ఉంటాయని మీరు (మోడీ) చెప్పారు. ఈ సమయంలో కొంతమంది సామర్థ్యం గల నేతలైనా వారి వారి రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బాధ్యత తీసుకోవాలి. మీరు చెప్పినట్టుగానే నేను స్వచ్ఛందంగా, మనస్పూర్తిగా కర్ణాటకలో పార్టీకి కొత్త వైభవం తెచ్చేందుకు పని చేస్తానని తెలుపుతున్నాను' అని లేఖలో యెడ్డీ వివరించారు.

  • Loading...

More Telugu News