: తన తండ్రి 1.8 శాతం ఓట్లతో గెలిచిన సంగతిని జగన్ మర్చిపోయాడా?: రాజేంద్రప్రసాద్
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే సంస్కారం కూడా వైకాపా అధినేత జగన్ కు లేదని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. 1.9 శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయామని చెబుతూ ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్న జగన్ కు... తన తండ్రి 1.8 శాతం ఓట్లతో గెలిచి అధికారాన్ని చేపట్టడం గుర్తులేదా? అని ప్రశ్నించారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని అధికారం కోసం పాకులాడటమేనా జగన్ కు తెలిసిన విశ్వసనీయత? అంటూ ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీలను టీడీపీ చేయకూడదనే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని మండిపడ్డారు.