: తెలంగాణ ఉద్యోగులు ఇక్కడే, ఆంధ్ర ఉద్యోగులు అక్కడకే: కేసీఆర్
తెలంగాణ ఉద్యోగులతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో ఉండాలని, ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రలోనే ఉండాలని అన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ లో కలసి ఉండేందుకు అవకాశమే లేదని... వారిని అనుమతించమని చెప్పారు. ఇరు ప్రాంతాలకు మధ్య అత్యంత పొడవైన సరిహద్దు ఉందని... అందరం కలసి మెలిసే ఉంటామని... కానీ, ఉద్యోగులు మాత్రం ఎవరి ప్రాంతాల్లో వారు ఉద్యోగం చేసుకోవాలని అన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ... ఒకే దేశంలో ఉన్నాం కాబట్టి... కలసి ఉండాలని చెప్పారు. అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయరాదని సూచించారు. ఉద్యోగులతో తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండరని, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు.