: ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తాం: సురవరం
ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో జరిగిన సీపీఐ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... మెజార్టీ ఉంది కదా అని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. లౌకికవాదాన్ని దెబ్బ తీసే చర్యల్ని ప్రతిఘటిస్తామని సురవరం అన్నారు.