: కదిరి స్టేట్ బ్యాంక్ సిబ్బందిపై కేసు నమోదు
అనంతపురం జిల్లా కదిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్ (ఎస్ బీఐ-ఏడీబీ)లో జరిగిన నిధుల మళ్లింపు కేసులో బ్యాంకు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అకౌంట్స్ అధికారి ఎంఎస్ జుహా, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్ కుమార్ రెడ్డిలపై 408, 409, 420, 477ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీకి సంబంధించిన కోటి రూపాయలకు పైగా సొమ్మును వీరు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బోగస్ ఖాతాలు తెరచి నిధులను దారి మళ్లించి... వాటి నుంచి నగదును డ్రా చేసుకున్నారు.