: తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మర్యాద పూర్వకంగానే కలిశామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. తమకు పదవులపై ఏమాత్రం ఆసక్తి లేదని, ప్రభుత్వంలో చేరబోమని అసద్ స్పష్టం చేశారు. కేసీఆర్ తో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా హైదరాబాదు అభివృద్ధిపై కేసీఆర్ తో చర్చించామని, హైదరాబాదులో నీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరామని వెల్లడించారు. అంతేగాక తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో చార్మినార్ ఉండాలని కూడా చెప్పామన్నారు. రెండో అధికార భాషగా ఉర్దూను గుర్తించేలా చూడాలని కూడా కోరినట్లు అసద్ వివరించారు.

  • Loading...

More Telugu News