: బీహార్ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ప్రకటించిన ఆర్జేడీ
బీహార్ లోని జేడీ(యూ) ప్రభుత్వానికి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ బేషరతు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో, రేపు జరగనున్న విశ్వాస పరీక్షలో జేడీ(యూ)కు అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించినట్లు ఆర్జేడీ తెలిపింది. రాష్ట్రంలో మళ్లీ బీసీ వ్యక్తి సీఎం అయినందువల్లే మద్దతు ఇస్తున్నామని లాలూ పార్టీ చెప్పింది. ఇటీవల నితీశ్ కుమార్ రాజీనామా చేయడంతో బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జితన్ రామ్ మంఝి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.