: విడిపోయినా కలిసే... తెలుగువారికి తప్పిన రోమింగ్ భారం


ఇప్పటి వరకూ ఒకే రాష్ట్రంగా ఉన్న తెలుగు నేల త్వరలో రెండు కానుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెడితే, ఇక్కడి వారు అటు వెళితే... మొబైల్ కాల్స్ కు రోమింగ్ చార్జ్ పడుతుందా? ఇప్పుడు కొందరిలో ఈ సందేహాలున్నాయి. కానీ, తీపి కబురు ఏంటంటే రాష్ట్రం రెండయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఒకే టెలికాం సర్కిల్ కింద కొనసాగనున్నాయి. టెలికం కంపెనీలకు లైసెన్స్ కాల పరిమితి 2024 వరకూ ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ రెండు ప్రాంతాలు ఒకే సర్కిల్ కింద కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. అప్పటికి దేశంలో రోమింగ్ చార్జీనే ఉండకపోవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడికి వెళ్లినా రోమింగ్ అంటూ అదనపు భారం వేసే విధానాన్ని ఎత్తివేయాలని ట్రాయ్ భావిస్తోంది.

  • Loading...

More Telugu News