: కేసీఆర్ తో భేటీ అయిన అసదుద్దీన్ ఒవైసీ
టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య మైత్రీ బంధం రోజురోజుకూ బలపడుతోంది. ఈ క్రమంలో, కాసేపటి క్రితం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, అతని సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ కలిశారు. హైదరాబాద్ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం తదితర అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ తో కలసి పనిచేస్తామని ఇప్పటికే ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే.