: పద్మ పురస్కారాలను అందుకున్న రామానాయుడు, బాపు
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. అత్యధిక చలన చిత్రాలను నిర్మించిన నిర్మాతగా రామానాయుడు ఇప్పటికే రికార్డుల పుస్తకంలోకి చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అందాల నటి శ్రీదేవి కూడా పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.
తన చిత్రాలతో తెలుగువారిపై చెరగని ముద్ర వేసిన బాపు (సత్తిరాజు లక్ష్మీ నారాయణ) కూడా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇంకా ప్రొఫెసర్ సత్య ఎన్ అట్లూరి, డీఆర్ డీవో డైరెక్టర్ విజయ్ కుమార్ సారస్వత్ తోపాటు భిన్న రంగాలకు చెందిన పలువురికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్, హోం మంత్రి షిండే తదితరులు హాజరయ్యారు.