: చెన్నైలో రజనీకాంత్ అభిమానుల సందడి


'కొచ్చాడయాన్' చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల హంగామా మొదలైంది. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ‘విక్రమసింహా’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రజనీ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకునే హీరోయిన్. భారత సినీ చరిత్రలో మొదటిసారిగా హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్ లో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆరు వేల థియేటర్లలో శుక్రవారం నాడు విడుదలకు సిద్ధమైంది. దీంతో చెన్నైలో రజనీ అభిమానుల సందడి మొదలైంది. చిత్ర బ్యానర్లతో మారథాన్ నిర్వహిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రజనీ అభిమాన సంఘాల ప్రతినిధులు సైదై రవి, షణ్ముగ పాండియన్ ల ఆధ్వర్యంలో ఈ సినిమా విజయం సాధించాలని కాంక్షిస్తూ పలు ఆలయాల్లో విశేష పూజలు చేశారు.

  • Loading...

More Telugu News