: తీహార్ జైలులో కేజ్రీవాల్ కు తొలి రాత్రి!


ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం నుంచి తీహార్ జైలు వరకు కేజ్రీవాల్ ప్రయాణం చిత్రంగా సాగుతోంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై చేసిన అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్ కోర్టు ముందు నిందితుడిగా నించోవలసి వచ్చింది. గడ్కరీ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో పరువు నష్టం దావా వేయడం, బెయిల్ కోసం నగదు పూచీ కత్తును ఇవ్వాలని కోర్టు ఆదేశించినా అందుకు నిరాకరించడం కేజ్రీవాల్ కే చెల్లింది. దీంతో కేజ్రీవాల్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు కోర్టు ఆదేశించడంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. దీంతో జైలులో మొదటి రాత్రి పూర్తి చేసుకున్నారు. రేపు ఉదయం వరకూ బెయిల్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి బెయిల్ కోసం పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేయాలని ఆప్ మద్దతుదారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News