: 'బాద్ షా' సినిమా టాక్ ఏమిటి?


క్లాస్ ప్రేక్షకులకు కావలసిన హాస్యాన్ని, మాస్ ప్రేక్షకులు మెచ్చే మాస్ మసాలా యాక్షన్ అంశాలను కలగలిపి 'వినోదం' ప్యాకేజీ ఇచ్చే  దర్శకుడు శ్రీను వైట్ల సినిమా అంటే అంచనాలు ఎక్కువగా వుంటాయి. ఈ రెండింటినీ సమపాళ్ళలో చేసి పండించగలిగే ఎన్టీఆర్ అందులో హీరో అయితే ఇక చెప్పేదేముంది? అందుకే, 'బాద్ షా' సినిమాకి మొదటి నుంచీ యమా క్రేజు ఏర్పడింది. పైగా, నిర్మాత బండ్ల గణేష్ డబ్బుల్ని మంచినీళ్ళలా ఖర్చు పెట్టి సినిమా తీశాడు. ఇంకేం ... ఈ రోజు విడుదలైన ఈ సినిమాకి ఓపెనింగ్స్ అదిరాయి!

ఇక, ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తోంది? వారి అంచనాలను అందుకోగలిగిందా? అనే ప్రశ్నలకు సినిమా చూసిన వారి నుంచి మిశ్రమ స్పందన సమాధానంగా లభిస్తోంది. గతంలో రజనీకాంత్ నటించిన 'బాషా' సినిమా కథకు, శ్రీను వైట్ల తరహా వినోదం తోడయ్యిందనీ, సూపర్ హిట్ అవ్వడం ఖాయమని కొందరు చెబుతున్నారు.

'దూకుడు' సినిమాలో కొత్త తరహా పాత్రలో నటించి మెప్పించిన ఎమ్మెస్ నారాయణ ఈ సినిమాలో చేసిన కామెడీ ట్రాక్ పండలేదని కొందరంటుంటే.. బ్రహ్మానందం మరోసారి రెచ్చిపోయాడని మరికొంతమంది సంతోషపడుతున్నారు. తమన్ సంగీతం పర్వాలేదనీ, పాటల చిత్రీకరణ మాత్రం బాగా వచ్చిందనీ ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే ప్రతికూల పవనాల కంటే సానుకూల మాటలే ఎక్కువగా వినిపించడం చూస్తుంటే, బండ్ల గణేష్ మరోసారి విజయవంతమయ్యాడని అనిపిస్తోంది!

  • Loading...

More Telugu News