: ఎన్డీఏకు జగన్ మద్దతు అవసరం లేదు: రాయపాటి
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎన్డీఏకు అవసరం లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే మోడీని జగన్ కలిశాడని ఆరోపించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని రాయపాటి దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తామంటే చేర్చుకునే అంశంపై అధినేత చంద్రబాబే నిర్ణయం తీసుకుంటారన్నారు.