: జమ్మూకాశ్మీర్ డీజీపీగా తెలుగు తేజం
ఎప్పుడూ అలజడి, అల్లకల్లోలంగా ఉండే జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి డీజీపీగా ఓ తెలుగు అధికారి నియమితులయ్యారు. 1984 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి రాజేంద్ర కుమార్ పోలీస్ బాస్ గా బాధ్యతలు చేపట్టారు. ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు. ఎంతో సమర్థవంతమైన అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 2006లో రాజేంద్ర కుమార్ పై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఆయన శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినా ఉగ్రవాదుల చర్యలను ఆయన ధైర్యంగా తిప్పికొట్టారు. ఇప్పటి వరకు ఈయన రాష్ట్రపతి పోలీస్ మెడల్, శౌర్య పతకం, షేర్-ఏ-కాశ్మీర్ ప్రతిభా సేవల పతకం, షేర్-ఏ-కాశ్మీర్ శౌర్యపతకం అందుకున్నారు. కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పట్టుబట్టి మరీ రాజేంద్ర కుమార్ ను డీజీపీగా నియమించారు.