: గుజరాత్ సీఎంగా అనందీబెన్ నేడు ప్రమాణం
గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆనందీబెన్ పటేల్ (72) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా మోడీ నిన్న వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు తమ నేతగా ఆనందీబెన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గుజరాత్ తొలి మహిళా సీఎంగా ఆనందీ పగ్గాలు చేపట్టబోతున్నారు.