: మోడీ ప్రమాణ స్వీకారానికి జయ దూరం?


ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. దీనికి కారణం మోడీ ఆహ్వానం పలికిన వారిలో శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే కూడా ఉండడమే. శ్రీలంకలో తమిళుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసి, వేలాది మంది తమిళ ఉద్యమకారులను కిరాతకంగా ఊచకోత కోయడంలో రాజపక్సేది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో తమిళ పార్టీలు శ్రీలంక ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రాజపక్సేను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రాజపక్సేను కూడా పిలిచినందున మోడీ ప్రమాణ స్వీకారానికి జయ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడులో బీజేపీతో మిత్రపక్షం ఎండీఎంకే కూడా రాజపక్సేను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తోంది. ఇది తమిళుల మనోభావాలను గాయపరుస్తుందని పేర్కొందని, రాజపక్సేను ఆహ్వానించవద్దని వైగో స్వయంగా మోడీ, రాజ్ నాథ్ ను కోరారు.

  • Loading...

More Telugu News