: పరీక్షకు అనుమతించండని చేతులు జోడిస్తున్న తల్లిదండ్రులు


రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ కాసేపటి క్రితం ప్రారంభమయింది. ఒక్క నిమిషం లేట్ అయినా పరీక్షకు అనుమతించమన్న నిబంధన విద్యార్థుల పాలిట శాపమైంది. చాలా మంది విద్యార్థులు పరీక్ష ప్రాంభమైన తర్వాత వచ్చారు. ట్రాఫిక్ జామ్ వల్ల రావడానికి కొంచెం లేట్ అయిందని విద్యార్థులు చెబుతున్నారు. వీరెవరినీ అధికారులు పరీక్ష రాయడానికి అనుమతించలేదు. దీంతో, విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు పరీక్షకు అనుమతించాలని వేడుకుంటున్నారు. తల్లిదండ్రులైతే కంటతడి పెట్టుకుంటున్నారు. తమ పిల్లలకు ఒక సంవత్సరం వృథా అవుతుందని ఆవేదన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News