: ఉద్యోగ సంఘాలతో నేడు భేటీ కానున్న కేసీఆర్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. హైదరాబాద్ కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ సెంటర్ లో వీరి సమావేశం జరగనుంది. సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు సర్టిఫికేట్లతో స్థానికుల కోటాలో ఇక్కడే స్థిరపడేందుకు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు, ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఉండవని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు, ఆప్షన్లు ఉంటే ఏ సమస్యలు ఉండవని సీమాంధ్ర ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు జరగనున్న సమావేశం కీలకంగా మారింది.

  • Loading...

More Telugu News