: అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామా
సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో బీజేపీ విజయ ఢంకా మోగించడంతో దేశంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నిన్న బీహార్ లో నితీష్ రాజీనామా చేయగా, ఇవాళ అసోం ముఖ్యమంత్రి పదవికి తరుణ్ గొగోయ్ రాజీనామా చేశారు. గొగోయ్ తన రాజీనామా లేఖను రేపు (గురువారం) సోనియాగాంధీకి సమర్పించనున్నారు. రాజీనామా చేసేందుకని ఆయన మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేస్తున్నారు.