: డైరెక్టుగా ముఖ్యమంత్రి అయితే ఇలాగే వుంటుంది!: పయ్యావుల
వ్యవసాయ
రుణాల మాఫీ సాధ్యం కాదంటూ ముఖ్యమంత్రి కిరణ్ ప్రకటించడంపై టీడీపీ
నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి, ఏ
ఒక్కరోజైనా కిరణ్ రైతు భుజం మీద చేయి వేసి నడిచారా? అని ప్రశ్నించారు.
మంత్రి కాలేనివారు డైరెక్టుగా ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందనీ, రైతులను అధైర్యపరిచే
మాటలే మాట్లాడతారని పయ్యావుల గుంటూరులో విమర్శించారు.