: కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నేత నితిన్ గడ్కరీ పరువునష్టం దావా కేసులో కేజ్రీ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో కోర్టుకు బెయిల్ బాండ్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించడంతో ఈ నెల 23 వరకు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ వెంటనే కేజ్రీను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించడంతో పాటియాలా కోర్టు ప్రాంగణంలో కేజ్రీను అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.