: ఉద్యోగుల స్థానికతపై కమిటీ ఏర్పాటు చేసిన కేసీఆర్
ప్రభుత్వ ఉద్యోగుల స్థానికతపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో హరీష్ రావు, స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, మహేందర్ రెడ్డి సహా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. రేపటి నుంచే ఈ కమిటీ తన ప్రారంభించనుంది. తెలంగాణభవన్ లోని ప్రత్యేక వార్ రూమ్ లో కమిటీ సభ్యులందరూ ప్రతిరోజు సమావేశం కానున్నారు. శాఖలవారీగా ఉద్యోగుల వివరాలన్నింటినీ సభ్యులు సేకరిస్తారు. విభజన సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా, తప్పుడు సర్టిఫికెట్లతో ఎవరైనా స్థానికత చూపిస్తున్నా తమను సంప్రదించాలని చెప్పారు. ప్రతిరోజూ తెలంగాణ భవన్ లో ఈ కమిటీ అందుబాటులో ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.