: ఈజిప్టు మాజీ ప్రధాని హోస్నీ ముబారక్ కు జైలు శిక్ష
ప్రజా నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఈజిప్టు మాజీ ప్రధాని హోస్నీ ముబారక్ కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. దీనికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఇద్దరు కుమారులు అలా, గమాల్ లపై కూడా నేరం నిర్ధారణ కావడంతో ఇక్కడి కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించినట్లు బీబీసీ వార్తా సంస్థ పేర్కొంది. హోస్నీ ప్రధానిగా ఉన్న సమయంలో అధ్యక్ష భవనాల పునర్నిర్మాణం కోసం 17.6 (103 కోట్ల 42 లక్షలు) మిలియన్ డాలర్లను ఉపయోగించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో, ఆయన్ను అరెస్టు చేసి విచారణ నిర్వహించారు.