: ఉద్యోగ సంఘాలతో రేపు భేటీ కానున్న కేసీఆర్


తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాటంలో సహకరించిన ఉద్యోగులకు కేసీఆర్ అభినందనలు తెలపనున్నారు. అలాగే ఆప్షన్ల వివాదంపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.

స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, మిగిలిన ఏ విషయాన్ని కూడా అంగీకరించబోమని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించినట్టుగానే తెలంగాణ నిర్మాణంలోనూ ఉద్యోగులు కీలక భూమిక పోషించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News