: పరువు నష్టం దావా కేసులో కోర్టు ముందుకు కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నానని కోర్టుకు తెలిపిన కేజ్రీవాల్... తాను ఏ తప్పు చేయనప్పుడు బెయిల్ కోరాల్సిన అవసరం లేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మీరు (కేజ్రవాల్) బాధ్యత వహిస్తున్నారని, అలాగే ఒక సాధారణ వ్యక్తిలాగే ప్రవర్తించాలని కోర్టు కోరింది. బీజేపీ నేత నితిన్ గడ్కరీ అవినీతిపరుడంటూ గతేడాది చివర్లో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దాంతో, గడ్కరీ పరువునష్టం దావా కేసు వేశారు. ఈ క్రమంలో కోర్టు అతనికి సమన్లు పంపింది.