: కాంగ్రెస్ కు నేను దగ్గరవడమా?: నితీశ్


కాంగ్రెస్ పార్టీకి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దగ్గరవుతున్నారని, కాంగ్రెస్ నితీశ్ ను నమ్మకమైన మిత్రుడిగా భావిస్తున్నట్లు మీడియాలోనూ, రాజకీయ వర్గాలలోనూ జోరుగా సాగుతున్న వార్తలను నితీశ్ ఖండించారు. తానేమీ కాంగ్రెస్ కు దగ్గర కావడం లేదని స్పష్టం చేశారు.

బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే యూపీఏ సర్కారును సంప్రదించానని చెప్పారు. తమ డిమాండ్ సాధన కోసమే ప్రధాని, తదితరులను కలిశామని.. దీనిని కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నట్లు భావించరాదన్నారు. బీహార్ కు ప్రత్యేక హోదా అన్నది ప్రజల డిమాండ్ అని, రాజకీయ పార్టీలది కాదన్నారు. 

పనిలో పనిగా నితీశ్ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు కూడా గుప్పించారు. అధికారంలో సుదీర్ఘకాలం ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని అన్నారు. కనీసం ప్రజలకు రక్షిత తాగునీటినీ కూడా అందించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News