: ఓ వివాదంతో చైనాలో కత్తులతో దాడి
చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో ఇరుగు పొరుగు వారి మధ్య గొడవ కాస్తా కత్తిపోట్లకు దారి తీసింది. ఈ తెల్లవారు జామున లుషాన్ కౌంటీలో కత్తులతో చేసుకున్న దాడిలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చైనాలోనే ఓ ప్రాథమిక పాఠశాలలోకి మంగళవారం అగంతుకుడు ప్రవేశించి ఏడుగురు విద్యార్థులపై కత్తితో దాడి చేసిన 24 గంటల్లోపే మరో దాడి జరగడం గమనార్హం. కత్తులతో దాడులు చైనాలో సర్వసాధారణంగా మారిపోయాయి. అమెరికాలో తుపాకుల సంస్కృతిలా చైనాలో దాడులకు కత్తుల వాడకం పెరిగిపోయింది.