: కాళ్లు కట్టేసి యువతిపై ఇద్దరు అత్యాచారం
ఒంటిరిగా ఉన్న యువతిపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. సోమవారం మధ్యాహ్నం ఇది జరగ్గా బాధిత యువతి నుంచి ఫిర్యాదు ఆలస్యంగా అందడంతో ఈ కేసు వివరాలను పోలీసులు ఈ రోజు వెల్లడించారు. థానే జిల్లా షహపూర్ తాలూకా పరిధిలోని ఘోటేగఢ్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న 22 ఏళ్ల యువతి కాళ్లను కట్టేసి ఇద్దరూ అత్యాచారం చేశారు. నిందితులు యువతి శరీరంలో పలు చోట్ల గాయపరిచి, అనంతరం పరారయ్యారని షహపూర్ స్టేషన్ ఏఎస్ఐ బాపూసాహెబ్ షిండే తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.