: అగ్గిపుల్లపై నరేంద్రమోడీ
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు చెందిన తకేశ్వర్ సిన్హా అనే బాలుడు నరేంద్రమోడీ ప్రతిరూపాన్ని అగ్గిపుల్లపై చెక్కాడు. ఇందుకోసం ఏడాదిపాటు కష్టపడ్డాడు. దీన్ని ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న నరేంద్రమోడీకి బహూకరించాలని అనుకుంటున్నట్లు అతడు మీడియాకు తెలిపాడు. దీన్ని భూతద్దం సాయంతో స్పష్టంగా చూడవచ్చు. మోడీ రూపాన్ని చాలా దగ్గరగా ఇతడు అగ్గిపుల్లపై చెక్కడం చూసేవారిని ఆకర్షిస్తుంది.